కరోనా సెకండ్ వేవ్ అంటా! ఇది ఇంకా డేంజర్ అట. మూడు రోజుల్లో చనిపోతారట నిజమేనా మేడం అంటూ రోజూ చాలా మంది అడుగుతున్నారు. సెకండ్ వేవ్ అంటే ఏంటి? జాగ్రత్తలు పాటించినప్పుడు కేసులు తగ్గుతాయి తగ్గాయి కదా అని మామూలుగా ఉంటే మళ్లీ పెరుగుతాయి. ఇది ఏ వ్యాధిలో అయినా కనిపించేదే. సెకండ్ వేవ్ అంటే కొత్త వైరస్ పుట్టుకురాదు ఇంకా ప్రమాదం కావడానికి.
వ్యాధి గురించి ఇప్పటికే ఒక అవగాహన వచ్చి ఉంటుంది కాబట్టి సెకండ్ వేవ్ లో ఇంకా తేలిగ్గా ఎదుర్కోవొచ్చు. కరోనా హెర్డ్ ఇమ్మ్యూనిటితో మాత్రమే పోయే జబ్బు. ఎంత జాగ్రత్తగా ఉన్నా వస్తుంది. అనవసర భయాలు పెట్టుకోకుండా దాన్ని పట్టించుకోకుండా ఉంటే (symptoms ఎక్కువ కనిపిస్తే తప్ప, 90% లో కనిపించవు ) అది కూడా మనని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది.
కరోనాని బతికిస్తూనే ఉంటారు…
ఒకసారి ఒక ఫ్రెండ్ అడిగాడు ఈ కరోనా కంప్లీట్ గా ఎప్పుడు పోతుంది అని. ఏ లాభాపేక్షతో ఈ భయంకర వాతావరణం సృష్టించారో ఆ లక్ష్యం నెరవేరేదాకా కరోనా పోదు. పోనివ్వరు అని చెప్పాను. ఇప్పుడు జరుగుతుంది అదే! ఈ సెకండ్ వేవ్ భయం అదే! రెండోసారి మళ్లీ వస్తుంది! అది ఇంకా ప్రమాదం! ఆంటీబాడీస్ మూడు నెలలే ఉంటాయి. ఏడు నెలలే ఉంటాయి. వాక్సిన్ మళ్లీ మళ్లీ వేసుకోవాలి… ఇలాంటి రకరకాల పైత్యాల వెనక ఉన్నది కేవలం వ్యాపారమే! ఇమ్మ్యూనిటి, ఆంటీబాడీస్ మీద కొందరు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారికి ఇది కొంత ఉపయోగపడుతుందని రాశాను.
శరీరంలో ఆంటీబాడీస్ పోతే ప్రమాదమా?
ఒక సూక్ష్మజీవి వల్ల వచ్చిన జబ్బు రెండోసారి మళ్లీ వస్తుందా?, మొదటిసారి వచ్చినప్పుడు శరీరంలో ఉత్పత్తి అయిన ఆంటీబాడీస్ కొంతకాలానికి పోతాయా? ఒకవేళ ఆ ఆంటీబాడీస్ పోతే అది ప్రమాదకరంగా మారుతుందా?
ఈ విషయాలు అర్థం కావాలంటే అసలు మన శరీరంలో ఇమ్మ్యూన్ సిస్టం పని చేసే విధానం గురించి కొంత తెలుసుకోవాలి. ఇక్కడ నేను చెప్పే విషయంలో పదాలు కొంచం గందరగోళంగా అనిపించినా కొంత ఇంటరెస్ట్ పెడితే చాలా తేలిగ్గా అర్థమౌతుంది.
రక్తంలో నాలుగు భాగాలు
ఇమ్మ్యూన్ వ్యవస్థకి ప్రధాన కారణం రక్తంలోని ల్యూకోసైట్స్. వీటినే వైట్ బ్లడ్ సెల్స్ (WBC ) అంటారు. మన రక్తంలో నాలుగు భాగాలు ఉంటాయి.
1 ప్లాస్మా. ఇది నీరు, ప్రోటీన్ ఇతర పోషకాలతో కలిసిన ఫ్లూయిడ్. ఇది రక్తంలో 55% ఉంటుంది.
2. ఎరిథ్రోసైట్స్ లేక RBC (ఎర్ర రక్త కణాలు ) ఇది ఆక్సిజన్ సప్లై కి ఉపయోగపడతాయి.
3. ప్లేట్ లెట్స్ (థ్రోమ్బోసైట్స్ ) గాయాలైనప్పుడు ఎక్కువ రక్తస్రావం జరగకుండా రక్తం గడ్డ కట్టేలా చేస్తుంది.
4. ల్యూకోసైట్స్ (తెల్ల రక్త కణాలు ) ఇవి ఇమ్మ్యూన్ సిస్టం కోసం పనిచేస్తాయి.
మన శరీరంలో ఇమ్మ్యూన్ వ్యవస్థ రెండు రకాలు
1. Innate immunity
2. Acquired immunity
Innate immunity లో పనిచేసే కణాలు న్యూట్రోఫిల్స్, ఇస్నోఫిల్స్, బెసోఫిల్స్, (ఈ మూడూ గ్రాన్యులోసైట్స్. వీటి కణాల సైటోప్లాస్మ్ అంచుల్లో గ్రాన్యూల్స్ (కణికలు) ఉంటాయి. అవి సూక్ష్మజీవుల్ని నాశనం చేసే ఎంజైమ్ లు, రసాయనాలు కలిగి ఉంటాయి.), మోనోసైట్స్, మాక్రోఫేజ్స్, డెండ్రైటిక్ సెల్స్, నాచురల్ కిల్లర్స్ (NK సెల్స్ ). ఇవన్నీ innate ఇమ్మ్యూనిటి లో పనిచేసే తెల్ల రక్త కణాలు.
ఇవి కాక తెల్ల రక్త కణాల్లో లింఫోసైట్స్ అని కూడా ఉంటాయి. అవి acquired ఇమ్మ్యూనిటికి దోహద పడతాయి. ఈ లింఫోసైట్స్ మళీ రెండు రకాలు. 1. B- cells, T- cells . B-cells బోన్ మారో లో పుట్టి అక్కడే మెచ్యూర్ అవుతాయి అందుకే వాటికి ఆ పేరు. T- cells బోన్ మారో లో ఉత్పత్తి చెందినా థైమస్ గ్రంథిలో మెచ్యూర్ అవుతాయి కాబట్టి T- cells అంటాము.
ఇప్పుడు innate, acquired ఇమ్మ్యూనిటి అంటే ఏంటో చూద్దాం:
Innate ఇమ్మ్యూనిటి అంటే పుట్టుకతో వచ్చిన ఇమ్మ్యూనిటి అని అర్థం. ప్రమాదకరమైన పాథోజెన్స్ శరీరంలోకి ప్రవేశించకుండా కొన్ని బారియర్స్ అడ్డుకుంటాయి. ఉదా:- చర్మం. సూక్ష్మజీవులు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఎపిథీలియల్ సెల్స్ ఆహారం ద్వారా లోపలికి వెళ్లే సూక్ష్మజీవుల్ని కడుపులోని ఆసిడ్ చంపేస్తుంది. కన్నీళ్లు, చెమట, మ్యూకస్ లోని లైసోజోమ్, లంగ్స్ పైన ఉన్న సీలియా పాథోజెన్ ని అక్కడే నాశనం చేసేస్తాయి.
ఒకవేళ వీటిని తప్పించుకుని సూక్ష్మజీవులు లోపలికి ప్రవేశించినప్పుడు న్యూట్రోఫిల్స్ వెంటనే రంగంలోకి దిగుతాయి. వీటిని phagocytes ( eating cell) అని కూడా అంటారు. ఇది ప్రమాదకరమైన సూక్ష్మజీవిని పసిగట్టి దాని మీద ఎటాక్ చేసి చంపి తినేస్తుంది. నాచురల్ కిల్లింగ్ కణాలు పాథోజెన్ తో పాడైన కణాలను సమూలంగా నాశనం చేసి ఇతర కణాలకు వ్యాపించకుండా రక్షిస్తాయి. Innate ఇమ్మ్యూనిటీకి ఫలానా సూక్ష్మజీవి అని సంబంధం లేదు శరీరంలోకి వచ్చింది ఎలాంటి పాథోజెన్ అయినా దాన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది. దీని రియాక్షన్ ఇమ్మీడియేట్ గా ఉంటుంది. అయితే ఎక్కువ కాలం ఉండదు.
బాక్టీరియా, వైరస్ ఎక్కువ వృద్ధి చెంది ప్రమాదకరంగా మారినప్పుడు ఈ innate ఇమ్మ్యూనిటి సరిపోదు మరింత ఎక్కువ రక్షణ కావాలి. అప్పుడు ఇది లింఫోసైట్స్ కి సమాచారం అందించి వాటిని ఆక్టివేట్ చేస్తుంది.
Acquired ఇమ్మ్యూనిటి రంగంలోకి…
యాంటిజెన్ ( బాక్టీరియా, వైరస్ etc ) మాక్రోఫేజ్ లోకి ప్రవేశించగానే అది కీమోకైన్ అనే రసాయనాన్ని విడుదల చేసి మిగతా ఇమ్మ్యూన్ కణాలను ఆకర్షించి వాటిని ఇమ్మ్యూనిటి ఉత్పత్తికి ప్రేరేపిస్తుంది. డెండ్రైడిక్ కణం వెంటనే ప్రమాదాన్ని గుర్తించి. పాథోజెన్ (బాక్టీరియా, వైరస్ etc ) ని శకలాలు (fragments ) గా విడగొట్టి acquired ఇమ్మ్యూనిటి కోసం లింఫోసైట్స్ ని ఆక్టివేట్ చేస్తుంది.
Acquired ఇమ్మ్యూనిటి చాలా స్పెసిఫిక్ గా ఉంటుంది. ఉదా:- కరోనా వైరస్ శరీరంలోకి వచ్చినప్పుడు దాని కోసమే దానికి విరుద్ధంగా ఇమ్మ్యూనిటి తయారవుతుంది. (ఇలా శరీరంలోకి వచ్చిన ప్రతీ ఫారిన్ బాడీ, ప్రమాదకరమైన అన్ని సూక్ష్మజీవులకూ ప్రత్యేకమైన ఇమ్మ్యూనిటి తయారవుతుంది). ఈ ఇమ్మ్యూనిటి డెవలప్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అయితే ఇది దీర్ఘకాలం ఉంటుంది.
లింఫోసైట్స్ లో B- సెల్స్, T- సెల్స్ అని రెండు రకాలు ఉంటాయని చెప్పుకున్నాము కదా. T- సెల్స్ హెల్పర్ సెల్స్ గా ఉంటూ B- సెల్స్ ని, అలాగే సైటోటాక్సిక్ టీ సెల్స్ (నాచ్యురల్ కిల్లర్ సెల్స్) ని ఉత్తేజపరుస్తాయి.
ఈ T-సెల్ వైరస్ ని చంపలేని పక్షంలో, B-సెల్ ప్లాస్మా కణంగా మారి ఆంటీబాడీస్ ఉత్పత్తి చేసి ఆ సూక్ష్మజీవి మీద దాడి చేసి వాటిని సమూలంగా నాశనం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. అయితే ఈ ప్రక్రియలో హెల్పర్ T-cell మెమరీ హెల్పర్ T-cell (CD4 cell ) ని, B-cell మెమరీ B- cell (CD8 cell )ని ఉత్పత్తి చేస్తాయి.
ఇవి శరీరంలో దశాబ్దాల తరబడి భద్రంగా ఉంటాయి. ఇదే సూక్ష్మజీవి రెండోసారి ( ఎన్నిసార్లయినా) మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు, ఉదా:- కరోనా వైరస్ రెండోసారి శరీరం లోకి ప్రవేశించినప్పుడు ఒకవేళ దానికి విరుద్ధంగా తయారైన ఆంటీబాడీస్ లేకపోయినా… ఈ మొత్తం ప్రాసెస్ మళ్లీ జరగాల్సిన పని లేకుండా మెమరీ హెల్పర్ T-cell వైరస్ ని వెంటనే గుర్తించి మెమరీ B- cell ని ఆక్టివేట్ చేస్తుంది. అంతే, అది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైరస్ కి విరుద్ధంగా ఆంటీబాడీస్ తయారు చేసి వైరస్ ని నాశనం చేసి మనకు వ్యాధి రాకుండా కాపాడుతుంది. అంటే ఒక సూక్ష్మజీవి వల్ల ఒకసారి వచ్చిన వ్యాధి మళ్లీ జీవితంలో వచ్చే అవకాశం లేదు. ఆ వైరస్ మళ్లీ ఎటాక్ అయ్యి, పాజిటివ్ వచ్చినప్పటికీ వ్యాధి మాత్రం రాదు.
ఎన్నిసార్లు ఆంటీబాడీస్ పోయినా సరే, మళ్లీ ఆ సూక్ష్మజీవి శరీరంలోకి రాగానే మెమరీ సెల్స్ సహాయంతో వెంటనే ఆంటీబాడీస్ తయారైపోతాయి.
వాక్సిన్ అమ్ముకోడానికి, ఆంటీబాడీస్ మాయం…
కరోనా వైరస్ ఒకసారి వచ్చినా… ఆ ఆంటీబాడీస్ మూడు నెలలకంటే ఎక్కువ ఉండవు. ఏడు నెలలకంటే ఎక్కువ ఉండవు. రెండోసారి వస్తే ప్రమాదం. కాబట్టి ఆల్రెడీ కరోనా వచ్చిన వాళ్ళు కూడా వాక్సిన్ తీసుకోవాలి. ఆ ఆంటీబాడీస్ కూడా పోతూ ఉంటాయి కాబట్టి ఈ వాక్సిన్ మళ్లీ మళ్లీ తీసుకోవాలి అని ఎవరైనా చెబుతున్నారంటే అది కచ్చితంగా మోసం అని అర్థం చేసుకోవాలి. అసలు ఏ వ్యాధికీ వాక్సిన్ అవసరం ఉండదు శరీరమే నిరోధకశక్తి పెంపొందించుకోగలదు. అయితే acquired ఇమ్మ్యూనిటి కి టైం పడుతుంది కాబట్టి అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలలో ఈ లోపు డామేజ్ జరగకుండా ఉండేందుకు కొన్ని వ్యాధులకు వాక్సిన్ తప్పని సరి అవుతుంది.
కొరోనా చాలా సింపుల్ వైరస్. 90% మందికి మొదటిసారి వచ్చినప్పుడే ఏ ఇబ్బంది లేకుండా సునాయాసంగా వెళ్ళిపోతుంది. అలాంటి రెండోసారి ఇంకెంత ఈజీ గా వెళ్తుందో కదా!
ఇప్పటికే మాస్క్ లు, శానిటైజర్ ల ముసుగులో విపరీతమైన దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడు వాక్సిన్ అమ్ముకోవడం కోసం WHO తో కలిసి వాక్సిన్ కంపెనీలు రోజుకో డ్రామా ఆడుతున్నాయి. ఈ లోపే అందరికీ కరోనా వచ్చి ఎవ్వరూ వాక్సిన్ తీసుకోకపోతే సంవత్సరం నుంచి సాగుతున్న కరోనా డ్రామా అంతా వృధా అయిపోతుంది. వీళ్ళు లాభాలు గడించేవరకు ఈ భయాన్ని భద్రంగా ఉంచుతారు, ఎంత కాలమైనా కరోనా వైరస్ ని చావనివ్వరు.
వాక్సిన్ చావుకు సిద్ధం కండి!
ఒక్క విషయం ఆలోచించండి కరోనా నిజంగా ప్రమాదకరమైనదే అయితే, అది నిజంగా ప్రపంచ ప్రజలందరి సమస్య అయితే… నిజంగా ప్రజల్ని కాపాడాలనే చిత్తశుద్ధితో వాక్సిన్ తయారీ జరుగుతుంటే… WHO ఆధ్వర్యంలో వాక్సిన్ తయారీ కలిసికట్టుగా జరిగేది. కానీ ఇప్పుడు ఒకరి ప్రయోగాలు ఒకరికి తెలియకుండా రహస్యాలు. అనేక వాక్సిన్ కంపెనీలు మళ్లీ మళ్లీ అవే ప్రయోగాలు, చేసినవే చేసుకుంటూ టైం వేస్ట్ కదా అని మనకు అనిపించొచ్చు. కానీ ఎవరి టైం వాళ్ళది, ఎవరి రహస్యాలు వాళ్ళవి, ఎవరి కంపెనీలు వాళ్ళవి, ఎవరి పెట్టుబడులు వాళ్ళవి… ఆటోమాటిగ్గా ఎవరి లాభాలు వాళ్ళవి.
వీరి ధనదాహానికి భయంతో సంభవించిన కరోనా చావులు చూసాం, భవిష్యత్ లో వాక్సిన్ చావులు చూడబోతున్నాం. హడావిడిగా చేసే వాక్సిన్ లు వికటించే అవకాశాలే ఎక్కువ. మరో వైపు వాక్సిన్ కంపెనీల పోటీ తత్వం సామాన్యుని ప్రయోగశాల జంతువుని చేస్తుంది. వారి లాభాలకు డోకా లేదు. బలి అయ్యేది సామాన్య ప్రజలే!