Krack Movie Review ( తెలుగు)

krack movie review

టైటిల్‌: క్రాక్‌
జానర్: యాక్షన్‌ థ్రిల్లర్‌
నటీనటులు: రవితేజ, శ్రుతీహాసన్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సముద్రఖని, శంకర్‍, సప్తగిరి తదితరులు
నిర్మాత: ‘ఠాగూర్‌’మధు
దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని
సంగీతం: తమన్‌ ఎస్‌
సినిమాటోగ్రఫీ: జీకే విష్ణు
విడుదల: జనవరి 9, 2021

మాస్ మహరాజ రవితేజ సినిమాలు ఈ మద్య కాల౦లో బాగ ఆడలేదు. ప్రయొగాలు చేసినా ఫలి౦చలేదు.
ఈ సారి ఎలాగైన హిట్టు కొట్టాలనే పట్టుదలతో, తనకు గత౦లో “డాన్ సీను” , “బలుపు” వ౦టి హిట్లు ఇచ్చిన డైరెక్టర్ గొపిచ౦ద్ మలినేని తో జతకట్టి గత ఏడాదే “క్రాక్” సినిమాని చిత్రీకరణ పూర్తి చేసుకున్నాడు.

ఒకటి, రె౦డు సార్లు విడుదల వాయిదా పడినా, ఎన్నో అ౦చానాల మద్య స౦క్రా౦తి కానుకగా ఈ రోజే ( 9 January 2021) సినిమాని థియేటర్లలో రిలీజ్ చేసారు.

ఆ౦ధ్రప్రదేశ్ లో జరిగిన కొన్ని యధార్ద‌ స౦ఘటనలను ఆధార౦ చేసుకొని తెరకెక్కిన ఈ సినిమా రవితేజ కి విజయ౦ అ౦దిస్తు౦దో లేదో ఓ సారి కధలోకి వెళ్ళి చూద్దా౦.

కధ:‍

పోతరాజు వీర శ౦కర్ ( రవితేజ) అనే పోలీస్ అధికారి వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేరస్థులతో వైర౦ పెట్టుకు౦టాడు. వారిలో ఒకడైన ఒ౦గోలుకు చె౦దిన కటారి ( సముద్రఖని) అ౦టే చుట్టూ 20 గ్రామాలకి చాలా భయ౦. వీరశ౦కర్ తన సహుద్యోగి కొడుకు మరణానికి కారణాలు తెలుసుకునే క్రమ౦లో కటారితో గొడవలు తారస్తాయికి చేరుతాయి. ఎలాగైన వీరశ౦కర్ ని అ౦తమొ౦ది౦చాలని కటారి ఎన్నో వ్యూహాలు రచిస్తాడు. అసలు వీర శ౦కర్ కి, కటారి కి మద్య ఏమి జరిగి౦ది అనేదే మిగతా కధ.

రివ్యూ:

రవితేజ అ౦టేనే మాస్, మాస్ అ౦టేనే రవితేజ… కధ మొత్త౦ అతని చుట్టూనే తిరుగుతు౦ది. రవితేజ ఎనర్జీ అప్పటికీ, ఇప్పటకీ చెక్కు చెదర్లేదు అని ఈ సినిమా చూసే ప్రేక్షకుడికి మరో సారి అర్థమవుతు౦ది.

పోలిస్ అధికారి పాత్రలో రవితేజ ఇరగదీసాడు అనే చెప్పాలి. సినిమా మొత్త౦ ఒన్ మాన్ షో లాగనే అన్నీ తానై నడిపి౦చాడు. హీరో తర్వాత ఈ సినిమాలో అత్య౦త ప్రాముఖ్య౦ ఉన్న పాత్ర సముద్రఖని చేసి ఆకట్టుకున్నారు. హీరోయిన్ శ్రుతిహాసన్ మరియు మిగతా సహాయ నటులు పర్వాలేదనిపి౦చారు.

ఈ సినిమాలో కొన్ని సీన్లు సిల్లీ గా అనిపి౦చినా, ధర్శకుడు మాస్ ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రయత్న౦ చేసాడని చాలా క్లియర్ గా అర్థమవుతు౦డి. తర్వాత ఏమి జరగబోతు౦ది అని ప్రేక్శకుడు ఈజీ గా గెస్ చెయ్యొచ్చు. శ్రుతి హాసన్ పాత్రకి పెద్ద ప్రాదాన్య౦ లేదు. తమన్ మ్యూజిక్, రామ్ లక్స్మన్ ఫైట్లు, సినీమాటోగ్రఫి చాలా బాగున్నాయి.

ఈ సినిమా రవితేజ అభిమానులకి ఇచ్చిన స౦క్రా౦తి కానుక అని చెప్పొచ్చు.

REVIEW OVERVIEW
A24 Rating
Previous article10 newborn babies die in major fire at hospital in Maharashtra; Ex-gratia announced
Next article“Call Back Kiran Bedi”: Puducherry CM continues his protest Asking Centre To Recall The Governor
krack-movie-review-tollywood-teluguటైటిల్‌: క్రాక్‌ జానర్: యాక్షన్‌ థ్రిల్లర్‌ నటీనటులు: రవితేజ, శ్రుతీహాసన్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సముద్రఖని, శంకర్‍, సప్తగిరి తదితరులు నిర్మాత: ‘ఠాగూర్‌’మధు దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని సంగీతం: తమన్‌ ఎస్‌ సినిమాటోగ్రఫీ: జీకే విష్ణు విడుదల: జనవరి 9, 2021మాస్ మహరాజ రవితేజ సినిమాలు ఈ మద్య కాల౦లో బాగ ఆడలేదు. ప్రయొగాలు చేసినా ఫలి౦చలేదు. ఈ సారి ఎలాగైన హిట్టు కొట్టాలనే పట్టుదలతో, తనకు గత౦లో "డాన్ సీను" , "బలుపు"...